తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగసభను సెప్టెంబర్ రెండోతేదీ సాయంత్రం నాలుగుగంటలకు హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 25 లక్షలమంది హాజరయ్యే ఈ సభ కోసం గురువారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. దాదాపు 1600 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ఎంపికచేశామని, అందులో సభావేదిక, బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు. ఈ సభ విజయవంతానికి కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.