*నీతి అయోగ్ నిర్వహించిన సర్వేలో దుమ్ములేపిన తెలంగాణ రాష్ట్రం.

 

  • *నీతి అయోగ్ నిర్వహించిన సర్వేలో దుమ్ములేపిన తెలంగాణ రాష్ట్రం. 
  • *అత్యుత్తమ ప్రదర్శన తో దేశానికి దిశా నిర్దేశం చేస్తున్న తెలంగాణ
  • *సర్వే ఫలితాల పై హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రజలు
ప్రతిపక్షాలు తెలంగాణలో అభివృద్ధి ఏమి జరగలేదని ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఆగడం లేదు.తాజాగా నీతి అయోగ్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసే విధంగా అత్యత్తమ ప్రదర్శన కనపరిచి శభాష్ అనిపించుకుంది.ప్రతిపక్షాలు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డ కూడా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సారధ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలన్న తపనతో ప్రతినిత్యం పరితపిస్తుంటారు.రాష్ట్రాల మధ్య పోటీని నిర్వహిస్తే అప్పుడు రాష్ట్రాలు అత్యద్భుతంగా ప్రదర్శన ఇస్తాయి. అప్పుడు దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది అని భావించిన నీతిఆయోగ్ గత సంవత్సరం ఈ  ఈ సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం అందరి అంచనాలు తలక్రిందులుగా చేస్తూ దేశ ఆర్థిక పరిస్థితి  బాగలేకున్న కూడా దేశానికి దిశా నిర్దేశం చేసే విధంగా ప్రదర్శన ఇచ్చింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ,పరిశ్రమల అభివృద్ధి, రక్షిత మంచినీటి కల్పన మొదలగు వాటిని ఆధారంగా తీసుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్రం అన్నిటికంటే ముందు ఉండడం నిజంగా శుభ పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తెలంగాణలో ఏదో పొడుస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదో సాధిస్తుంది అని పిచ్చి మాటలు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ రాష్ట్రం అన్నిటికంటే ముందు ఉండడం పట్ల ఏం మాట్లాడుతారు అని విశ్లేషకులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు.
ఈ దశాబ్దం తెలంగాణ రాష్ట్రానిదే అని, గౌరవనీయులైన మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు చెప్పిన విధంగానే కొత్త సంవత్సరంలో కొత్త శక్తిని,ఉత్సహాన్ని ఇచ్చే విధంగా ఈ సర్వే ఫలితాలలో తెలంగాణ రాష్ట్రం అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచింది అని భావిస్తున్నారు. ఇలాగే తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే మంచి ప్రదర్శన ఇస్తూ అన్ని రాష్ట్రాలకి ఒక మంచి దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నారు.తెలంగాణతో పాటు కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా సర్వేలో ముందు నిలిచి భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీలు అవసరం తమకు లేకున్నా కూడా తమ ప్రాంతాల్లో తాము సొంతంగా అభివృద్ధి చేసుకోగలమని దక్షిణాది రాష్ట్రాలు మరోసారి నిరూపించినట్టు అయింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సర్వేల్లో అట్టడుగున ఉండడం భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ప్రజలపై ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది అని చెబుతున్నారు.