ఐటీ అంటే తెలంగాణా

 

  • ఐటీ అంటే తెలంగాణా
  • ఇకపై ఐటి అంటే ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటున్న కేటీఆర్…
  • రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం…
  • ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు ఫ్యాకల్టీ కి శిక్షణ ఇస్తున్న వైనం…

ఐటీ రంగానికి కొత్త నిర్వచనం చెప్పిన తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భావించేవారని రాబోయే భవిష్యత్తులో దీన్ని ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గా పరిగణిస్తారని ఉద్బోధించారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న మనమంతా ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి అవసరం ఉందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఐటీ రంగానికి కేరాఫ్ గా ఉన్న తెలంగాణను మరింతగా అభివృద్ధి చేసేలా తమ ప్రభుత్వం పథకాలను రూపొందించిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది కాలేజీలో చదువుతున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి కేటీఆర్ మాటల ద్వారా మరోసారి  వ్యక్తమయ్యాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి చాలా రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్య ఉన్నప్పటికీ అది అనేక కొరతలతో కొనసాగుతోంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై వివిధ కమిటీల ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకు ఫ్యాకల్టీ లకు శిక్షణ ఇస్తోంది. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఈ ప్రయత్నంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఇది ఎంతగానో కొత్త పుంతలు తొక్కింది. ఇటీవల జరుగుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్ లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రతి జిల్లాలోనూ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉత్కృష్టమైన మానవ వనరులు అభివృద్ధి చెందిన ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణను బంగారు భయంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు అన్ని రంగాల్లో కృషి చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంతకుముందు ఎంతో కాలంగా వైస్‌ ఛాన్సలర్‌లు లేకుండా యూనివర్సిటీలలో పాలన గాడి తప్పుతున్న తరుణంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్‌ఛాన్సలర్‌లను నియమించింది. ఎలాంటి ఒత్తిళ్లకు, పైరవీలకు తావులేకుండా సమర్ధులైన వారిని వి.సి.లుగా నియమించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆచార్య పసుల సాంబయ్య, ఆచార్య సీతారామారావు, ఆచార్య రామచంద్రం వంటి వారిని వి.సి.లుగా నియమించి ఉన్నత విద్యలో తెలంగాణ ఆత్మ ఆవిష్కారానికి కృషి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన ఆచార్య తుమ్మల పాపిరెడ్డిని, వైస్‌ ఛైర్మన్లుగా ఆచార్య రిక్క లింబాద్రి, ఆచార్య వెంకటరమణలను నియమించి ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. ఉన్నత విద్యా మండలి వివిధ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ ఫలితాలను తక్కువ కాలంలో వెల్లడించడంలో సఫలీకృతమైంది.పాఠ్య పుస్తకాలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదా యాలు, పండుగలు, అవసరాలు, అవకాశాలు ప్రతిబింభిం చేలా సిలబస్‌ రూపకల్పన జరిగింది.

తెలంగాణ స్వరాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య జయశంకర్‌ సార్‌ పేరును, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రజాకవి కాళోజి నారాయణరావు పేరును, వెటర్నరి యూనివర్సిటీకి తెలంగాణ ముద్దు బిడ్డ పి.వి.నరసింహారావు పేరును అలాగే ఉద్యాన వర్సిటీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరును పెట్టుకోగలిగాం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. అలాగే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సిద్దిపేటలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయడమైంది. హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీని మహిళా విశ్వవిద్యా లయంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు మొదలైనాయి. బిబినగర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ కృషితో కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య చదువుకోవడానికి ఓవర్సీస్‌ విద్యానిధి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ పథకం కింద 20లక్షల రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి సంవత్సరం 1500 పైగా విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గత సంవత్సరం దాదాపు 294 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల నాణ్యమైన ఉన్నత చదువు కోసం గురుకుల డిగ్రీ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 298 ఉన్న జనరల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను వచ్చే మూడేళ్లలో 1200కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మన గురుకుల విద్యా విధానం కేజీ టూ పీజీ ప్రణాళికలు, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఉన్నత విద్యలో కీలకమైన డిగ్రీ ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అడ్మిషన్ల ప్రక్రియను సులభతరం చేసింది. విద్యార్థులకు ఒక్క అప్లికేషన్‌తో రాష్ట్రంలోని ఏ కాలేజీలోనైనా సీటుకు దరఖాస్తు చేసుకునే విప్లవాత్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పారదర్శకత, సులభతరం, అక్రమాలకు అడ్డుకట్టలా దోస్త్‌ విజయవంతమై ఏటా కనీసం 2లక్షల డిగ్రీ అడ్మిషన్లు సక్రమంగా జరుగు తున్నాయి. ప్రైవేటు దోపిడికి అడ్డుకట్ట పడింది. ఉన్నత విద్య చదివే వారి స్కాలర్‌షిప్‌లను కూడా పెంచింది.

యూనివర్సిటీలను నేషనల్‌ అసిస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ (నాక్‌) గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహిం చడంతో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలు నాక్‌ గుర్తింపును తెచ్చు కున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్‌, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ప్రత్యేక తనిఖీ బృందాలతో కఠినమైన తనిఖీలు చేయడంతో నిబంధనల అమలుకు, ప్రమాణాల పెంపుకు అవకాశం ఏర్పడింది.

దేశంలో మొత్తం 22 రాష్ట్రాలలో ప్రైవేటు యూని వర్సిటీలు ఉండటం, మన రాష్ట్ర విద్యార్థులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవడం గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచస్థాయిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావాలని సంకల్పించి ప్రైవేటు విశ్వ విద్యాలయాల బిల్లుకు అనుమతిచ్చింది. పోటీతత్వం పెర గడం, అవకాశాలు అన్నలక్ష్యంతో ఉన్నత విద్యను అభివృద్ధి చేయడం తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కృషి సల్పుతున్నది. పారిశ్రామిక అవసరాలకు, ఉద్యోగాల కల్ప నకు అనువైన విద్య, అంతర్జాతీయస్థాయి వసతులు, ప్రమాణాలు ఉండాలన్నదే లక్ష్యం. ఇన్ని విధాలుగా సాంకేతిక విద్యను డెవలప్ చేస్తున్న రాష్ట్ర ప్రయత్నాలను చూసి నిపుణులు అభినందింస్తున్నారు. త్వరలోనే రాష్ట్రం బంగారుమయంకానుందని పేర్కొంటున్నారు. ఐటీ రంగంతోపాటు అనేక విధాలుగా తెలంగాణ డెవలప్ కానుందని అభిప్రాయపడుతున్నారు.