సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతికి వెల్లువెత్తుతున్న స్పందన

  • సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతికి వెల్లువెత్తుతున్న స్పందన
  • తెలంగాణలోని ప్రతి పౌరుడు పల్లె ప్రగతిలో పాల్గొంటున్నారు
  • తెలంగాణ అభివృద్ధిలో పల్లె ప్రగతి పాత్ర అమోఘం
  • ఇప్పటివరకు ఏరాష్ట్రమూ ఆలోచించని కార్యక్రమం ఇది
    పల్లె ప్రగతి.. సీఎం కేసీఆర్ దూరదృష్టి, విజన్ కు నిదర్శనం. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదు. పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అన్న సిద్ధాంతాన్ని నమ్మిన సీఎం కేసీఆర్… పల్లె ప్రగతిపై దృష్టి సారించారు. ముందు పల్లెలు అభివృద్ధి చెందితే ఆటోమెటిక్ గా పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. అదే రాష్ట్ర అభివృద్ధికి తొలిమెట్టు. ఇప్పటికే పల్లెల్లో 30 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత… దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
    ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. తెలంగాణ వాసులే కాకుండా.. విదేశాల్లో స్థిరపడిన వాళ్లు కూడా తమ గ్రామాలకు వచ్చి… పల్లె ప్రగతిలో పాల్గొంటున్నారు. వ్యాపారవేత్తలు, ఉన్నత విద్యావంతులు.. అందరూ తమ పల్లెను అభివృద్ధి చేసే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇది అభివృద్ధి అంటే. ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ప్రారంభించలేదు. అంతెందుకు… గత ప్రభుత్వాలు కూడా ఏనాడూ తెలంగాణ పల్లెలను పట్టించుకున్న పాపాన పోలేదు.
    కానీ… సీఎం కేసీఆర్ మాత్రం తాను ఇచ్చిన మాట ప్రకారం… పల్లెలను కూడా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా పల్లెల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ఓవైపు హరితహారం, గ్రీన్ చాలెంజ్ లాంటి మంచి కార్యక్రమాలు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. మరోవైపు పల్లె ప్రగతి కూడా అంతే వేగంగా ముందుకెళ్తోంది. ఇది అసలైన అభివృద్ధి అంటే. ప్రతి గ్రామంలో అన్ని సౌకర్యాలు మెరుగుపడాలని, పట్టణాలను తలపించాలన్న సంకల్పంతో… ప్రారంభించిన ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా మంచి పరిణామం. సీఎం కేసీఆర్ ను నమ్మి.. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా… వెంటనే అందరూ స్పందించి.. ఆ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా కావాల్సింది ఇదే. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు సీఎం కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. అందుకే.. ఇప్పుడు తెలంగాణవైపు ప్రపంచం చూస్తోంది. తెలంగాణ పథకాలను ప్రపంచమంతటా అమలు చేస్తున్నారు. తెలంగాణ గురించి ప్రపంచం చెప్పుకునేలా సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. ఒక తెలంగాణ సగటు పౌరుడికి ఇంతకన్నా ఇంకేం కావాలి. నాది తెలంగాణ అని ప్రతి ఒక్కరు సగర్వంగా కాలరు ఎగరేసి చెప్పుకునే స్థాయికి తెలంగాణను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు.