పచ్చని చెట్లు… ప్రగతికి మెట్లు

 

పచ్చని చెట్లు… ప్రగతికి మెట్లు

మహోజ్వలంగా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్…

మొక్కలు నాటడమే కాదు. మన చుట్టూ ఉన్న వారిని కూడా మొక్కలు నాటేలా ప్రోత్సహించడం గ్రీన్ ఛాలెంజ్ లక్ష్యం. అందుకే ఈ హరిత సవాల్ వినూత్నంగా కొనసాగుతోంది. ఒకరు మొక్క నాటిన తర్వాత.. మరో ముగ్గురిని నామినేట్ చేయాలి. వారిలో ఎవరైనా మొక్కను నాటితే.. వారు కూడా మరో కొత్త ముగ్గురిని నామినేట్ చేయాలి. ఇలా ఎంపీ సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ బృహత్ కార్యం..

దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఒకరిని చూసి మరొకరు.. వారిని చూసి ఇంకొందరు.. ఆ కొందరిని చూసి మరి కొందరు… ఇలా.. పదులు వందలు దాటి వందలు వేలు దాటి కోట్లాది మొక్కలకు చేరింది గ్రీన్ ఛాలెంజ్. సామాన్యజనంతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మేముసైతమంటూ ఈ హరితయజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్రను పోషిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ను మనసారా అభినందిస్తున్నారు.