దేశంలోనే మొదటిసారి… తెలంగాణలో వంద శాతం బాలికల్లో అక్షరాస్యత

 

  • దేశంలోనే మొదటిసారి… తెలంగాణలో వంద శాతం బాలికల్లో అక్షరాస్యత
  • వేరే రాష్ట్రాలను దాటుకొని ముందుకెళ్తున్న తెలంగాణ
  • ఇదే తెలంగాణ ప్రజలు కోరుకునేది
  • సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందనడానికి ఇదే ఉదాహరణ

నాన్హీకలీ అనే ఓ సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో బాలికల్లో అక్షరాస్యత ఎలా ఉందని పరిశీలించింది. బాలికలపై నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ టాప్ లో నిలిచింది. బాలికల్లో నూటికి నూరు శాతం అక్షరాస్యత ఉందని నిరూపితమైంది. దేశంలోని మిగితా రాష్ట్రాలతో పోల్చితే బాలికల అక్షరాస్యతలో తెలంగాణ టాప్ లో నిలిచింది.

తెలంగాణలో విద్యా ప్రగతి కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పలు పథకాలు సక్సెస్ అయ్యాయని చెప్పడానికి ఈ సర్వేనే బెస్ట్ ఉదాహరణ. ప్రత్యేకంగా బాలికల్లో విద్యపై అవగాహన కల్పించడం కోసం.. వాళ్ల సంక్షేమం కోసం సీఎ కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలలు బాలికల్లో 100 శాతం అక్షరాస్యత తీసుకొచ్చేలా ప్రోత్సహించాయి. అంతే కాదు.. వాళ్లకు హాస్టళ్లలో పౌష్ఠికాహారం, హైజీన్ కిట్స్ లాంటివి అందిస్తూ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న మద్దతుతో తెలంగాణ నేడు దేశంలోనే వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచింది.

తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టేదాక నిద్రపోను అని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలు నేడు ఒక్కొక్కటీ నిజం అవుతున్నాయి. కొత్త రాష్ట్రం, గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి వెళ్లాయి. అలాంటి రాష్ట్రాన్ని పాలించడమే కాదు.. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనేది ఓ సవాల్. కానీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే అది సీఎం కేసీఆర్ తోనే అవుతుంది అని మరోసారి నిరూపితం అయింది. ఒక సగటు తెలంగాణ పౌరుడిగా ఇంతకన్నా ఇంకేం కావాలి.