చరిత్రలో నిలిచిపోయేలా.. అపర హరిత సాధకుడిగా..!
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ఆయన మొదలుపెట్టిన గ్రీన్ చాలెంజ్ ప్రక్రియ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సామాన్యుల నుంచి.. కార్పొరేట్ స్థాయి వరకూ.. ఎంతో మంది ప్రముఖులు ఈ చాలెంజ్ లో భాగమవుతున్నారు. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా తామూ సమిధలు అవుతున్నారు. సంతోష్ కుమార్ మొదలు పెట్టిన ఈ చాలెంజ్.. ఖండాంతరాలు దాటే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన ఈ చాలెంజ్ గురించి పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అసలు ఈ ఆలోచన ఎలా పుట్టింది.. ఎలా ఇంత ఉద్యమంగా ఉధృతంగా రూపు దాల్చింది అన్నది తెలుసుకుంటున్నాయి. తమ పరిధిలో పచ్చదనాన్ని పెంచేలా సంతోష్ కుమార్ ఆలోచనలను తాము కూడా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంపీ సంతోష్ ఎలా ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోయారన్న విషయంపై అధ్యయనం చేస్తున్నాయి.